నంద్యాల టిడిపి కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రజలతో నేరుగా మమేకమవడం ద్వారా సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు.