జనగణన–2027 స్వీయ నమోదు ప్రక్రియలో భాగంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఆన్‌లైన్‌లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు స్వయంగా ఈ ప్రక్రియలో పాల్గొని తోడ్పడాలని ఆమె పిలుపునిచ్చారు. సమగ్ర గణాంకాలతో సమర్థమైన పాలన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.