నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం 2025 రెండో విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 662 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ రూ. 1.22 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 1170 మొబైళ్లను రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ సునీల్ షొరాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బాధితులు తమ ఫోన్లు తిరిగి పొందడంతో ఆనందం వ్యక్తం చేశారు.