ఎంపీ శబరి వద్దకు వినతుల వెల్లువ.. అక్కడికక్కడే పరిష్కారం

నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డు వద్ద టీడీపీ జిల్లా కార్యాలయ భూమిపూజ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి వందలాది మంది ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించారు. వికలాంగురాలైన బిడ్డతో వచ్చిన ఒక మహిళ సహాయం కోరడం అందరినీ కదిలించింది. ఎంపీ అక్కడికక్కడే ప్రజా ధర్బార్ నిర్వహించి, అధికారులకు ఫోన్ చేసి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు. మిగిలిన వాటిని త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్