నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవకు ఫలితంగా, 17261/17262 గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు కోవెలకుంట్లలో ఆగే అవకాశం కలిగింది. రైల్వే అధికారులు ఆగస్టు 2 నుంచి ప్రయోగాత్మకంగా ఆ స్టేషన్‌లో 6 నెలల పాటు రైలు నిలుపుదల అమలు చేయనున్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఎంపీ కోరారు. ఈ అభ్యర్థనను నెరవేర్చిన ఎంపీకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.