నంద్యాల: సుంకేసుల జలాశయం నుంచి 10 గేట్లు ఎత్తివేత

రాజోలి శివారులోని సుంకేసుల జలాశయం నుంచి శనివారం 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి 42,500 క్యూసెక్కుల వరద జలాలు జలాశయానికి వచ్చి చేరుతున్నాయని, అందులో 39,400 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 292 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 290.50 మీటర్లుగా ఉంది.

సంబంధిత పోస్ట్