సీఎం రిలీఫ్ ఫండ్ ను వెంటనే విడుదల చేసి ఆదుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో చేసిన ఆర్ధిక దోపిడీ వల్ల రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగా ఉందన్నారు. అయినప్పటికీ పేదలకు ఎలాంటి అసౌకర్యం కలుగవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నంద్యాలలో శుక్రవారం బాధితులకు పంపిణీ చేశారు.