మార్చి 16 నుంచి ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిశాయి. రంజాన్ పండుగ కారణంగా వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించారు. ఉయ్యాలవాడ మోడల్ స్కూల్లో మొత్తం 235 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల ప్రక్రియ మొత్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.