రాష్ట్ర ప్రభుత్వం పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా పీ- 4 విధానాన్ని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. పీ - 4 స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నంద్యాల పట్టణంలోని 15వ వార్డు గోపాల్ నగర్ లో అవ్వ తాతలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు.