నంద్యాల: ఇంధన కొరతపై కలెక్టర్‌కు కాంగ్రెస్ లేఖ

నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉందని, దీనిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మద్దులేటి స్వామి జిల్లా కలెక్టర్‌కు బహిరంగ లేఖ రాశారు. పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయని, రైతులు, రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని, పోలీసు పహారా ఏర్పాటు చేసి ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్