ఎస్‌ఐ పేరుతో బెదిరింపులకు పాల్పడి రూ.15 లక్షలు వసూలు చేసిన నకిలీ పోలీసును కోవెలకుంట్ల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆళ్లగడ్డ DSP ప్రమోద్ వివరాల మేరకు.. జడ్చర్లకు చెందిన చంద్రశేఖర్, సందీప్ కోవెలకుంట్లకు చెందిన ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేశారు. తాము గద్వాల ఎస్‌ఐ అని పరిచయం చేసుకుని, ఓ మహిళ ఆత్మహత్యకు ఆయనే కారణమని బెదిరించి డబ్బు దోచుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.