నంద్యాల: రైతులు తప్పకుండా పంటల భీమా చేయాలి: కలెక్టర్

నంద్యాల జిల్లాలోని రైతులందరూ తమ పంటలకు తప్పకుండా పంటల బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని విసి హాల్ నందు క్రాఫ్ ఇన్సూరెన్స్ పై అగ్రికల్చర్, హార్టికల్చర్, బ్యాంకు అధికారులతో జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుంటారని రైతులు వేసే ప్రతి పంటకు తప్పనిసరిగా పంటల బీమా చేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్