నంద్యాల: ఉచిత కంటి వైద్య శిబిరం జయప్రదం

నంద్యాల విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి 200 మంది హాజరయ్యారని అధ్యక్షులు వెంకట సుబ్బయ్య తెలిపారు. వైద్య పరీక్షలతో పాటు వారికి ఉచితంగా మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షులు వై. ఎన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్