నంద్యాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించామని నిర్వాహకుడు వై.ఎన్ రెడ్డి తెలిపారు. శిబిరానికి 200 మంది హాజరయ్యారు. వారికి అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. పట్టణంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.