నంద్యాల జిల్లాలో మంగళవారం భారీగా నగదు లభ్యమైంది. నంద్యాల - డోన్ జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ బస్సులో రూ.37,90,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నంద్యాలకు చెందిన బంగారు వ్యాపారి షేక్ అన్వర్ హుస్సేన్ అని తెలుస్తోంది. అయితే ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.