దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా బుధవారం నంద్యాల పట్టణంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ నుండి గాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభ ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పాల్గొని మద్దతు తెలిపారు.