నంద్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఉయ్యాలవాడలోని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి స్వగృహం ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో చెట్టుపై మంటలు ఎగసిపడ్డాయి. అదృష్టవశాత్తు, పిడుగు పడిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు మంటలను చూసి భయాందోళనకు గురయ్యారు.