ఈనెల 17వ తేదీ మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈ మాసం "బీట్ ది హీట్" (వేడి ప్రభావాలను తగ్గించే అంశంపై) కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ నుండి స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ పటిష్ట అమలుపై జిల్లాధికారులు, సంబంధిత మండల అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.