నంద్యాల: ట్రాక్టర్ టైర్ కిందపడి వ్యక్తి మృతి

నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన శంకర్ (45) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఇటుకల లోడుతో బయలుదేరిన ట్రాక్టర్ పెద్దకొట్టాల గ్రామం సమీపంలో అదుపుతప్పింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌పై నుంచి కిందపడిన శంకర్ టైర్ కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్