నంద్యాల పట్టణంలోని మర్కజ్ జామియా మస్జీద్ అభివృద్ధికి రూ. 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన రూ. 50 లక్షల్లో రూ. 10 లక్షలు మాత్రమే వినియోగం కాగా, మిగిలిన నిధులు వెనక్కి వెళ్లాయి. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చొరవతో తిరిగి రూ. 40 లక్షలు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో మౌలిక వసతులు మెరుగుపరచి, మస్జీద్‌ను భక్తులకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ దృష్టికి ఇది నిదర్శనమని తెలిపారు.