నంద్యాల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 21న నంద్యాల ఎన్టీఆర్ షాదీఖానాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. 11 ప్రైవేటు సంస్థలు పాల్గొంటాయని పేర్కొన్నారు. పది, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బి. టెక్, బీడీఎం, ఫార్మసీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.

సంబంధిత పోస్ట్