తిరుపతి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శుక్రవారం రేణిగుంట ఎయిర్‌పోర్టులో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రోడ్ల సమస్యలపై ఆయనతో చర్చించారు. కాగా రేపు (శనివారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు నితిన్ గడ్కరీ.