నంద్యాల అయ్యలూరులో శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ఫరూక్, టీడీపీ పార్టీ పరిశీలకుడు నరసానాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఆనందం సీఎం చంద్రబాబు పాలనకు ప్రతిబింబమని మంత్రి వ్యాఖ్యానించారు. పెన్షన్‌ను రూ. 4000గా అందిస్తూ తొలి నెలలోనే రూ. 7000 చెల్లించామన్నారు. గ్రామం మొత్తం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైన టీడీపీ నేతలు, అధికారులున్నారు.