నంద్యాల టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాజీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, అమరావతి అంశాలపై కోర్టులకు వెళ్లడం రాజకీయ దివాళాకోరుతనమని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.