నంద్యాల: పెట్రోల్ కొరతపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం

నంద్యాల జిల్లాలో వారం రోజులుగా పెట్రోలు, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో చర్చించి సమస్యను పరిష్కరించలేకపోవడం పరిపాలనా వైఫల్యమని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఎరువులు, వంట గ్యాస్ కొరతలతో అల్లాడుతున్న ప్రజలు ఇప్పుడు ఇంధన సంక్షోభంతో మరింత ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరా పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్