నెల్లూరులో జగన్‌ను కలవడానికి వచ్చిన ప్రజలను, వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడంపై ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకే అధికారమని, అభిమాన నాయకుడిని కలవడానికి అడ్డుకోవడం కక్షసాధింపు చర్య అని మండిపడ్డారు.