తిరుపతి నుంచి తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డిలు కాలినడకన వెళ్లి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని సోమవారం విఐపి బ్రేక్ దర్శనం దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు శ్రీకాంత్ తదితరులు ఘన స్వాగతం పలికారు.