తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డిలు పాదయాత్రగా వెళ్లారు. రాత్రి తిరుమలలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులు బస చేసి సోమవారం తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. తిరుమలకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఎంపీ శబరి తెలిపారు.