నంద్యాల: బోయ వాల్మీకుల ఎస్టీ హక్కులపై లోక్‌సభలో ఎంపీ శబరి గళం

ఆంధ్రప్రదేశ్‌లోని బోయ వాల్మీకులను షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి బుధవారం లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశారు. వేటవృత్తి, వెనుకబాటుతనం, 1871 క్రిమినల్ ట్రైబల్ చట్టం వల్ల జరిగిన అన్యాయం, 1961 రిజిస్ట్రార్ సిఫారసులు, 2017 ఏపీ అసెంబ్లీ తీర్మానం వంటి అంశాలను ఆమె వివరించారు. కర్ణాటకలో ఎస్టీ హోదా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు లేదని ప్రశ్నిస్తూ, ఇది రాజకీయాలు కాదని, న్యాయం, రాజ్యాంగ సమానత్వమే తమ కోరిక అని ఎంపీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్