తిరుపతి జిల్లాలోని ప్రముఖ కాళహస్తీశ్వరస్వామి వార్లను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డిలు ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దంపతులకు కాళహస్తీశ్వర దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకగా, స్వామి అమ్మవారి దర్శనము అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదం అందించారు.