ఈ నెల 14న సోమవారం ఉదయం 9-30 గంటలకు నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్ కు వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు.