నంద్యాల: రైతు వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి: ఎమ్మెల్సీ

పోతిరెడ్డిపాడు అంశంలో రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న నష్టం, అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తెలిపారు. ఆదివారం నందికొట్కూరులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పరిపాలనకు బదులు కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని విమర్శించారు. ఈనెల 5న తరిగోపులలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్