నంద్యాల: నాటుసారా స్థావరాలపై దాడి.. ఆరుగురి అరెస్ట్

నంద్యాల జిల్లాలో పోలీసులు నాటుసారా వ్యాపారాలపై బుధవారం దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ.. ఐదు కేసుల్లో ఆరుగురిని అరెస్టు చేసి 75 లీటర్ల నాటుసారా, 1000 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకొని, పాత నేరస్తులైన 23 మందిని రిమాండ్‌కు పంపామని తెలిపారు. అలాగే కర్ణాటక నుంచి మద్యం తీసుకొస్తుండగా నరేష్ అనే వ్యక్తిని పట్టుకుని 672 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్