నంద్యాల: బ్యాంకులకు భద్రతా మార్గదర్శకాలపై ఎస్పీ సమీక్ష

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం బ్యాంక్ మేనేజర్లతో సమీక్ష సమావేశం జరిగింది. దొంగతనాలు నివారించేందుకు సీసీ కెమెరా డేటా క్లౌడ్‌లో నిల్వ చేయాలని, అత్యవసర నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలన్న సూచనలు చేశారు. 1930 సహాయ నెంబర్‌తో పాటు బ్యాంకుల టోల్ ఫ్రీ నెంబర్లు వివరించారు.

సంబంధిత పోస్ట్