నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 25 మంది మైనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున రూ. 1,25,000 జరిమానా విధించారు. ASP మంద జావళి మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇచ్చినా, వాహనాలు నడిపినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమైతే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.