నంద్యాల: ట్రాన్స్‌ఫార్మర్ రాగి వైర్ చోరీ ముఠా అరెస్ట్

నంద్యాల జిల్లాలో రైతుల ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగిలించిన ఇద్దరు నిందితులను రేవనూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 83,700 నగదు, 30 కిలోల రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నారు. బండి ఆత్మకూరు, నంద్యాల తాలూకా, రేవనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్