నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లె వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాలి ప్రవీణ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నంద్యాల నుంచి ఎర్రగుంట్లకు బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు గుండంపాడు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.