కృష్ణా నదిలో చిక్కుకున్న ఆరుగురు యువకులను మత్స్యకారుడు నాగన్న సాహసోపేతంగా కాపాడారు. బుధవారం సంకిరేణిపల్లెకు చెందిన యువకులు నదీతీరాన్ని వీక్షించేందుకు వెళ్లి, అక్కడ ఉన్న పుట్టిని ఉపయోగించి లోతులోకి వెళ్లారు. నీటి ప్రవాహంతో వారు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న నాగన్న బోటుతో వెళ్లి వారిని గాలించి సురక్షితంగా ఒడ్డుకి తీసుకువచ్చాడు.