నన్నూరు స్కూల్‌లో నోట్ బుక్స్ పంపిణీ

ఓర్వకల్లు మండలం నన్నూరులో శుక్రవారం నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ అందజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి ఇంట్లో పిల్లల సంఖ్య మేరకు తల్లికి వందనం అందించామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈవో, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్