నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు మండలం పార్లపల్లె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 'నో టచ్' (ఎవరిచ్చినా తీసుకోరాదు) అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఏ వస్తువునూ తినరాదని, పాఠశాలకు ఎవరైనా వస్తే వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలని పోలీసులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీ పాల్గొన్నారు.