తిరుమల లడ్డుపై అసత్య ప్రచారం చేస్తున్న కూటమి నేతలను ఖండించి, వైఎస్ఆర్సీపీ నాయకులు కల్లూరు అర్బన్ 36వ వార్డు వాసవినగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి 101 కొబ్బరికాయలు కొట్టి, కూటమి నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చర్య భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆరోపించారు.