నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్‌లో ఈ నెల 7వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు జమాతుల్ ఉలేమా వల్ అఐమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ అల్ హింద్ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగత ధార్మిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో రంజాన్ మాస విశేషాలు, ఉపవాస దీక్షలు, జకాత్ అంశాలపై మత పెద్దలు ప్రసంగిస్తారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, సదస్సు అనంతరం భోజన వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.