రుద్రవరం: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధలు తట్టుకోలేక రుద్రవరం మండలంలోని ముత్తులూరు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నంద్యాల భాస్కర్ రెడ్డి (48)గా గుర్తించారు. ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం, భాస్కర్ రెడ్డికి రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో 19 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అప్పులను తీర్చలేక భాస్కర్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు అన్నారు.

సంబంధిత పోస్ట్