రుద్రవరం: పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విజయ

రుద్రవరం మండలంలోని పేరూరు సచివాలయం పంచాయతీ కార్యదర్శిగా విజయ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సిరివెళ్ల మండలం వనికెదిన్నె పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విజయను పేరూరు పంచాయతీ కార్యదర్శిగా బదిలీపై ఉన్నతాధికారులు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇన్ని రోజులుగా పేరూరు ఇన్చార్జి కార్యదర్శిగా ముత్తలూరు పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్ ఇన్చార్జిగా ఉంటున్నారు.

సంబంధిత పోస్ట్