నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం ఆరు ప్రదేశాలలో సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశారు. వీటిని ఈఓ శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు నేరుగా దర్శనం, అర్చిత సేవలను స్వయంగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా సేవలు పొందేందుకు www.srisailamdevasthanam.org వెబ్సైట్ అందుబాటులో ఉంది.