నంద్యాల జిల్లా స్థానిక పీజీ కళాశాల క్రీడా మైదానంలో సబ్ జూనియర్ బాల బాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా బేస్బాల్ అసోసియేషన్ గౌరవనీయులు చైర్మన్ షేక్ బాబూలాల్, అధ్యక్షులు షేక్ షబ్బీర్ అహ్మద్, కార్యదర్శి సివి సుబ్బయ్య, ట్రెజర్ పుల్లయ్య తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి బేస్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని, ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 1/1/2011న జన్మించినవారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9885859183, 9010960734 నంబర్లను సంప్రదించవచ్చు.