కల్లూరు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు తెలుగు మద్దిలేటికి చెందిన నాలుగు బర్రెలు విద్యుత్ షాక్‌తో మృతిచెందాయి. ఈ ఘటనపై పాణ్యం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన్ రెడ్డి బాధిత రైతును పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. విద్యుత్ శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులతో మాట్లాడి రైతుకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.