హైదరాబాద్‌లోని జేఆర్సీ ఫంక్షన్ హాల్‌లో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మరియు గౌరు వెంకట రెడ్డి కుమారుడు టీడీపీ యువనేత గౌరు జనార్దన్ రెడ్డి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు.