చిన్నహుల్తి: బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామంలో శనివారం చోరీ జరిగింది. సీఐ జయన్న తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఇంటి తలుపులు, బీరువా తలుపులు కూడా తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుల వివరాల మేరకు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయని అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ జయన్న విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్