నంద్యాలలో యోగా గురువు పాములేటి స్వామి ఆరాధన వేడుకలు ఘనంగా

నంద్యాలలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో ఆదివారం మాఘమాస పౌర్ణమి సందర్భంగా యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆరాధన వేడుకలు యోగానంద ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి వారికి పంచామృత అభిషేకం, లోకకళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ, యోగా గురువు దామోదర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం ప్రసాద వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్